తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ జనవరి 9న ప్రపంచవ్యాప్త గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాతో రజినీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్‌కు కోర్టు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన దర్బార్ చిత్ర రిలీజ్‌ను నిలిపివేయాలంటూ మలేషియాకు చెందిన డిఎంవై క్రియేషన్స్ అనే సంస్థ మద్రాసు కోర్టులో పిల్ దాఖలు చేసింది.లైకా ప్రొడక్షన్స్ కంపెనీకి రోబో 2.0, దర్బార్ చిత్రాల కోసం ఫైనాన్స్ చేసినట్లు పిల్‌లో పేర్కొంది.అయితే లైకా ప్రొడక్షన్స్ తమకు రూ.23.7 కోట్లు చెల్లించాల్సిందని ఆ సంస్థ పిల్‌లో తెలిపింది.దాఖలైన పిటీషన్‌పై జనవరి 2లోగా వివరణ ఇవ్వాల్సిందిగా మద్రాసు కోర్టు లైకా సంస్థను ఆదేశించింది.

రజినీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తున్న దర్బార్ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయగా నయనతార హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.మరి జనవరి 9న రజినీ దర్బార్ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం ప్రస్తుతానికైతే సస్పెన్స్.







