హైదరాబాదులో కిలో ఉల్లి రూ.40 ఎక్కడో తెలుసా...?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీంతో సామాన్య ప్రజలు ఉల్లిగడ్డలు సామాన్య ప్రజలు కొనడం మానేశారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఉల్లి సమస్యను అధిగమించడానికి ఇతర దేశాల నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంటోంది.అలాగే వీటిని ప్రజలకు సబ్సిడీ రూపంలో అందిస్తుంది.

అయితే తాజాగా హైదరాబాదులో  కొండెక్కిన ఉల్లి ధరల సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బజార్ లో ఒక్కొ మనిషికి రెండు కిలోల ఉల్లిగడ్డలను ప్రభుత్వం రాయితీపై కేవలం 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. 

దీంతో జనాలు ఎగబడి క్యూలైన్లలో నిల్చుని కొంటున్నారు.అయితే ఇది ఇలా ఉండగా మన దేశంలో ఉల్లి ధరలు పెరగడంతో కల్కి దేశం నుంచి ఎక్కువ ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు.దీంతో అక్కడ ఉల్లి ధరలు అమాంతం పెరగడం మొదలయ్యాయి.

Advertisement

దీంతో టర్కీ దేశం నుంచి ప్రస్తుతం ఉల్లి దిగుమతులను నిలిపివేశారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు