వైసీపీ నాయకులు మూర్ఖులు అంటున్న జగన్ మాజీ మిత్రుడు

ఏపీ రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరు చెప్పలేరనే విషయం అందరికి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ వేరుపడిన తర్వాత అతనికి అండగా నిలబడిన అతి కొద్ది మంది వ్యక్తులలో సబ్బం హరి కూడా ఒకరు.

జగన్ కి మద్దతుగా నిలబడటంతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ తో కలిసి ప్రయాణం చేశారు.అతనితో సన్నిహితంగా ఉంటూ జగన్ ని అత్యంత ఆప్తుడుగా మారిపోయారు.

అయితే తరువాత కాలంలో ఏమైందో తెలియదు కాని మొదటిగా జగన్ తో ఉంది అతని కోసం కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఏ ఒక్కరు కూడా ఆయన వెంట లేరు.అప్పట్లో జగన్ ని తిట్టి, అతని వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

జగన్ నుంచి దూరం అయిన తర్వాత 2014 ఎన్నికలలో పోటీ చేయకుండా ఉన్న సబ్బంహరి గత ఎన్నికలలో మాత్రం టీడీపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున భీమిలి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు మీద పోటీ చేశారు.ఎన్నికల సమయంలో టీడీపీ పక్కా అధికారంలోకి వస్తుందని జ్యోతీశ్యం చెప్పిన సబ్బం హరి ఓటమి తర్వాత గత ఆరు నెలలుగా కొంత సైలెంట్ గా ఉన్నారు.

Advertisement

అయితే తాజాగా మరల మీడియా ముందుకి వచ్చిన హరి ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అసలు ఏపీకి మూడు రాజధానులు పెట్టడం అనేది మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు.

జగన్ ఏడు నెలల పాలనలో అభివృద్ధి అనేది అస్సలు జరగలేదని, అయితే మంత్రులు మాత్రం పూటకో మాట చెబుతూ ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని అన్నారు.వైసీపీ నేతలు మూర్ఖులని వారు ఎవరు చెప్పిన మాటలు వినే స్థితిలో లేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ మాట తప్పను, మడమ తిప్పను అంటారు కాని, అతను ప్రతి సారి మాట తప్పుతూనే ఉంటాడని విమర్శించారు.అయితే విశాఖని రాజధానిగా చేస్తామని జగన్ చెప్పిన తర్వాత కూడా ఒక విశాఖ వాసిగా సబ్బంహరి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు