భారతీయుల వలసపై కెనడా నిషేధం ఎత్తివేసి 100 ఏళ్లు: వేడుకకు ఏర్పాట్లు

భారత్ నుంచి కెనడాకి వలస వచ్చిన భారతీయులకు ఆశ్రయం కల్పించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం విక్టోరియాలో వేడుకలు జరగనున్నాయి.సాయంత్రం 5.

30 నుంచి 7.30 వరకు జరిగే ఈ కార్యక్రమానికి విక్టోరియా సిటీ హాల్ ఆతిథ్యం ఇవ్వనుంది.పాల్గొనాలని ఆసక్తివున్న ప్రజలు సిటీ హాల్‌కి దగ్గరలో ఉన్న పండోరా వీధిలో ఏర్పాటు చేసిన మెయిన్ ఎంట్రన్స్‌ను ఉపయోగించాలని నిర్వాహకులు తెలిపారు.1919కు ముందు నుంచే భారతీయ పురుషులు ఉపాధి కోసం కెనడాలో అడుగుపెట్టారు.అప్పుడు కేవలం మగవారికే అనుమతి ఉండేది, మహిళలు, పిల్లలకు కెనడా ప్రభుత్వం అనుమతించలేదు.

అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం నుంచి వచ్చే మహిళలు, పిల్లలపై ఇమ్మిగ్రేషన్ నిషేధాన్ని ఎత్తివేయాలని అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం.కెనడాపై ఒత్తిడి తీసుకొచ్చింది.

ఈ క్రమంలో డిసెంబర్ 24, 1919న కెనడా ప్రభుత్వం భారతీయ మహిళలు, చిన్నారుల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది.అప్పటి నుంచి అనేక మంది భారతీయులు విద్య, ఉద్యోగ, వ్యాపార, పర్యాటకం కోసం కెనడాకు తరలివస్తున్నారు.అమెరికా, యూకేల తర్వాత భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే దేశంగా కెనడా రికార్డుల్లోకి ఎక్కింది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు