గవర్నర్ తీరుపై మండిపడుతున్న మిత్రపక్షాలు, రిట్ పిటీషన్

మహారాష్ట్రలో నెల రోజుల రాజకీయ ప్రతిష్టంభనకు శనివారం ఉదయం నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముగింపు పలికిన విషయం తెలిసిందే.

ఎన్సీపీ పార్టీ కి చెందిన అజిత్ పవార్ తన మద్దతు బీజేపీ కి ఇస్తున్నట్లు తెలిపి అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ బీజేపీ సర్కార్ ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

అయితే హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ పరిణామాల పై అటు కాంగ్రెస్,శివసేన పార్టీ లు బిత్తర పోయాయి.ఉన్నట్టుండి రాత్రికి రాత్రి బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం,అలానే డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడం చక చకా జరిగిపోయాయి.

మరోపక్క ఎన్సీపీ బీజేపీ కి మద్దతు తెలపలేదని, ఇదంతా కూడా అజిత్ సొంత నిర్ణయం అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా స్పష్టం చేయడంతో శివసేన కూడా అజిత్ పవార్ తీరుపై మండిపడింది.అయితే మహారాష్ట్రలో ఏర్పడిన పరిణామాల పై గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి పై కాంగ్రెస్,శివసేన,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రిట్ పిటీషన్ ను దాఖలు చేసింది.

దీనితో ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించినట్లు తెలుస్తుంది.

Advertisement

దేవేంద్ర ఫడ్నవిస్‌ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల తో కూడిన బెంచ్ శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధనను విచారించనుంది.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడం, అయన చేత ప్రమాణం చేయించడం చట్టవిరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు