టీడీపీలో 'జంపింగ్' కుదుపులు ! రంగంలోకి అమిత్ షా

ప్రస్తుతం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి నాయకుల్లో నమ్మకం పెంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నమే లేదు.

ఉద్యమాలు, ఆందోళనలు, పలకరింపులు, ఓదార్పులు, బుజ్జగింపులు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిత్యం తీరిక లేకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.

బాబు పడుతున్న కష్టానికి ఫలితం వస్తుందనుకుంటున్న సమయంలో ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతుండడం బాబు ని మంరితగా కుంగదీస్తోంది.తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు సుమారు పదిమంది వరకు బీజేపీలోకి వెళ్లేందుకు విశాఖ టీడీపీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు ద్వారా ప్రయత్నిస్తున్నారన్న విషయం బాబుకు నిద్ర లేకుండా చేస్తోంది.

అదే జరిగితే టీడీపీ మరింతగా దెబ్బతింటుంది అన్న ఆందోళన ఆయనలో ఎక్కువాగా కనిపిస్తోంది.అందుకే పార్టీకి చెందిన ఎమ్యెల్యేలు ఎవరూ చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు.

దీనిలో భాగాంగానే బీజేపీ దూకుడికి అడ్డుకట్ట వేయాల్సిందిగా తనకు పరిచయం ఉన్న ఆరఎస్ ఎస్ నేతలతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయంలో బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేందుకు ఇష్టపడవంలేదు.ఏపీలో టీడీపీ స్థానాన్ని ఎలా అయినా ఆక్రమించి తాము బలపడాలని అందుకు అవసరమైన వ్యూహాన్ని ఇప్పటి నుంచే అమలు చేయాలని చూస్తోంది.ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ని కలుపుకుని టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం 23 మంది ఉన్నారు.

వీరిలో సగానికిపైగా బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

వీరందరీతో కలిసి, అసెంబ్లీలో బీజేపీ శాసన సభా పక్షం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయతిస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.ఇదే విషయం రాంమాధవ్‌‌తో పాటు సుజనా చౌదరితోనూ గంటా శ్రీనివాస రావు చర్చించినట్టు తెలుస్తోంది.తెలుగుదేశం ఎమ్యెల్యేలు బీజేపీ లోకి వెళ్తే అనర్హత వేటు పడే అంశంతో పాటు ఇతరత్రా న్యాయ పరమైన అంశాలపైనా వారు చర్చించినట్టుగా తెలుస్తోంది.

దానిపై ఒక క్లారిటీ రాగానే వారు పార్టీ మారడం ఖాయమట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

బీజేపీ వచ్చేందుకు రెడీ గా ఉన్న ఎమ్యెల్యేల లిస్ట్ ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకులకు అందిందట.అందుకే వారిలో కొంతమంది వైసీపీ వైపు వెళ్లాలని చూస్తున్నా వారు వెళ్లకుండా బీజేపీ అడ్డుకుంటోందట.టీడీపీకి చెందిన కొంతమంది నాయకుల పేర్లు చెప్పి మరీ వారిని పార్టీలోకి తీసుకోవద్దు అంటూ స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా జగన్ కు ఫోన్ చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

అందుకే వైసీపీలో చేరేందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సిద్ధమైనా వైసీపీ నుంచి పెద్దగా స్పందన రావడంలేదట.ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ, గతంలో ఇలాగే జరిగిందని ప్రచారం జరిగింది.

వైసీపీలోకి వెళ్లాలని కన్నా దాదాపు సిద్ధమైనా అమిత్‌ షా, వైసీపీ అధినాయకులకు ఫోన్ చేసి, కన్నాను చేర్పించుకోవద్దని చెప్పారట.ఇప్పుడు కూడా బీజేపీ అదే రీతిలో రాజకీయం చేస్తూ ఏపీలో బలపడి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజా వార్తలు