తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులు దాటి పోయింది.ప్రభుత్వం పట్టు వదలక పోవడంతో పాటు ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గక పోవడంతో సమ్మె మరీ ఉదృతం అయ్యింది.
నిన్న అర్థరాత్రి వరకు డ్యూటీలో జాయిన్ అయ్యే వారు అవ్వొచ్చు లేదంటే వారు ఇకపై ఆర్టీసీ కార్మికులుగా పరిగణించబడరు అంటూ సీఎం కేసీఆర్ రెండవ సారి హెచ్చరించాడు.అయినా కూడా కార్మికులు ఎవరు కూడా డ్యూటీల్లో జాయిన్ అవ్వడం లేదు.
కేంద్రం బలం చూసుకుని కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారనిపిస్తుందంటూ టాక్ వినిపిస్తుంది.
ఆర్టీసీ కార్మికులకు మొదటి నుండి కూడా బీజేపీ నాయకుల మద్దతు లభిస్తుంది.
వారు కేంద్రం వద్ద మరియు గవర్నర్ వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రకటన తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కేంద్రం వద్దకు కూడా ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తీసుకు వెళ్లారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుత అతి త్వరలో కేంద్రం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించబోతున్నట్లుగా ప్రకటించాడు.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కేంద్రం ప్రకటన ఉంటుందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బీజేపీ నాయకులు కేంద్రం వద్ద ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేయడంతో వారు స్పందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే కేంద్రం పరిధిలో ఆర్టీసీ ఉండదని, సలహా లేదా సూచన వరకు చేస్తుంది తప్ప తల దూర్చదంటూ టీఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.