హీరో హీరోయిన్లకు అభిమానులు నీరాజనాలు పట్టడం మనం చూస్తుంటాం.తమ అభిమాన నటులను చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు.
కొన్నిసార్లు వారి అభిమానం మితిమీరుతుండటంతో నటీనటులు ఇబ్బందులు పడుతుంటారు.ఇలాంటి ఘటనలతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటారు.
ఇలాంటి ఘటనే తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌కు ఎదురయ్యింది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిపోతున్న ఓ భామ ఒక నగల దుకాణం ఓపెనింగ్‌కు వెళ్లింది.
ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు.ఆ గుంపులో ఆమెను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టాడు.
దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురైంది.కాగా పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
అక్కడ అతడు చెప్పిన సమాధానంతో వారు కూడా షాక్ అయ్యారు.
తన అభిమాన నటి ఇలా షోరూంల ఓపెనింగ్ అంటూ తిరుగుతూ ఉంది తప్ప సినిమాలు చేయడం లేదు.
తనకు ఆమె అంటే చాలా ఇష్టమని.ఆమె వెంటనే సినిమాలు చేయాలని అతడు కోరాడు.
అభిమానం మితిమీరితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని మరోసారి ప్రూవ్ అయ్యింది.ఏదేమైనా అభిమానం కొంత వరకు ఉంటేనే బాగుంటుందని.
అది హద్దు దాటితే ఏమాత్రం బాగుండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







