అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలను ఒణించిన ఉగ్రవాద సంస్థ ఐసీస్ అధినేత బగ్దాదీని అమెరికా జవాన్లు సిరియాలో అంతమొందించిన విషయం తెల్సిందే.ఎన్నో వందల మంది ప్రాణాలు కోవడంలో కీలక పాత్ర పోషించిన బగ్దాదీని అమెరికా అత్యంత దారుణంగా అంతమొందించింది.
ఇక ఈ ఆపరేషన్ కోసం అమెరికా భారీగా ఖర్చు చేసింది.బగ్దాదీని అంతం చేసే ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షించాడు.
లైవ్‌లో ఆ విజువల్స్‌ను చూసిన ట్రంప్ బగ్దాదీ మరణంపై గర్వంతో సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
ఒక ఇంట్లో బాగ్దాదీ ఉన్న విషయం అమెరికా అధికారులకు సమాచారం వచ్చింది.
కాని అది బాగ్దాదీనేనా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ వ్యక్తి డీఎన్‌ఏ కావాల్సి వచ్చింది.అందుకోసం అతడి అండర్‌వేర్‌ను ఒక వ్యక్తి తెచ్చి ఇచ్చారు.
ఆ వ్యక్తి తెచ్చిన అండర్ వేరు ఆధారంగా డీఎన్‌ఏ టెస్టు నిర్వహించి అక్కడ ఉన్నది బాగ్దాదీనే అనే నిర్ధారణకు వచ్చి అతడిని చంపేశారు.ఈ ఆపరేషన్‌లో అండర్ వేర్ కీలక పాత్ర పోషించింది.
అందుకే అండర్ వేర్ తీసుకు వచ్చిన వ్యక్తికి ఏకంగా 177 కోట్ల రూపాయలను అమెరికన్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రాణాలకు తెగించి ఆ అండర్ వేర్‌ను ఆ వ్యక్తి తీసుకు వచ్చారు.
అయితే ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలియజేయలేదు.







