ఆశ్చర్యం, సెకండ్ హ్యాండ్ లో కొన్న కోటు జేబు లో వేల డాలర్స్

సెకండ్ హ్యాండ్ లో కొన్న కోటు లో వేల డాలర్స్ దొరికిన ఘటన అమెరికా లో చోటుచేసుకుంది.

అమెరికాలోని ఒక సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం షాపు ఉంది.

అయితే ఆ షాపు లోకి అక్కడ ఇక్కడ నుంచి వస్తువులను కొని అక్కడ రీసేల్ చేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో అక్కడ పలు వస్తువులు దర్శనమిస్తూ ఉంటాయి.

అయితే ఆ సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం షాపు లో జెన్నిఫర్ కైమ్స్ అనే మహిళ చాలా కాలంగా అక్కడే పనిచేస్తుంది.అయితే తన పనిలో భాగంగా రోజూ కూడా ఆ షాపు లోని సెకండ్ హ్యాండ్ వస్తువులను చెక్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఆ షాపులోకి వచ్చిన సెకండ్ హ్యాండ్ వస్తువులలో భాగంగా ఒక కోటు ను చెక్ చేస్తుండగా ఆశ్చర్య కరంగా ఆ కోటు జేబులో వేల డాలర్లు దొరికాయి.అయితే ఒక్కసారిగా కోటు జేబులో అంత మొత్తంలో సొమ్మును చూసిన కైమ్స్ కంగారు పడి వెంటనే షాపు యజమాని అయిన టేమీ వెండ్ లాండ్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పేసింది.

Advertisement

దీనితో విషయం తెలుసుకున్న షాపు యజమాని టేమీ వెంటనే అక్కడకు చేరుకొని ఎక్కడ ఆ కోటును కొన్నది అన్న విషయాన్నీ గుర్తించి నేరుగా ఆ షాపు వద్దకు వెళ్ళాడు.

  అయితే షాపు కు వెళ్లిన టేమీ ని గుర్తు పట్టిన ఆ మరో షాపు యజమాని తన కోటు లో 7 వేల డాలర్లు పెట్టి మరచిపోయినట్లు తెలిపింది.దీనితో టేమీ ఆ సొమ్ము ను ఆ షాపు ఓనర్ కు అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడు.నిజంగా ఎలాంటి స్వార్ధం లేకుండా టేమీ తనకు దొరికిన రూ.5 లక్షల(ఇండియన్ కరెన్సీ ప్రకారం) ను మరో షాపు ఓనర్ కు అప్పగించి ఆదర్శంగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు