మెగా 152లో చరణ్‌ పాత్ర ఏంటో తెలిసి పోయింది

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.భారీ బ్లాక్‌బస్టర్‌గా సైరా నిలిచిన నేపథ్యంలో తర్వాత సినిమాపై సహజంగానే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.

 Ram Charan Role In Chiru 152 Movie-TeluguStop.com

అలాంటి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించడం.అదే సినిమాలో చరణ్‌ నటిస్తున్నట్లుగా వార్తలు రావడం జరుగుతుంది.

చిరంజీవి 152వ చిత్రంలో డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు అంటూ మొదట ప్రచారం జరిగింది.ఆ తర్వాత చిరంజీవి రామ్‌ చరణ్‌ లు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో కొన్ని సీన్స్‌ హీరో నక్సలైట్‌గా కూడా కనిపిస్తుందట.

అప్పుడు చిరంజీవి యంగ్‌ పాత్రలో చరణ్‌ కనిపించబోతున్నాడట.అంటే హీరో పాతికేళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు చరణ్‌గా కనిపిస్తాడు.50 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు చిరంజీవిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Telugu Chiranjeevi, Chiru, Koratala Siva, Naxalite Role, Ram Charan Role-

 

భరత్‌ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ సినిమా దాదాపు సంవత్సరంకు పైగా గ్యాప్‌ తీసుకున్నాడు.గ్యాప్‌ తీసుకున్నాడు అనే కంటే వచ్చిందంటే బెటర్‌.ఎందుకంటే సైరా చిత్రం కారణంగా కొరటాల చాలా ఎదురు చూడాల్సి వచ్చింది.ఎట్టకేలకు ఆ సినిమా విడుదలైన నేపథ్యంలో చిరు 152ను మొదలు పెట్టాడు.వచ్చే నెలలో రెగ్యులర్‌ షూట్‌కు వెళ్లి వచ్చే ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube