తెలుగు '96'ఎక్కడ ఉందో తెలుసా?

తమిళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న క్లాసికల్ మూవీ "96".అక్కడ విడుదలై ఇటీవలే సంవత్సరం పూర్తి చేసుకుంది.

సంవత్సరం అయినా కూడా సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గలేదు.సినిమా పలు సార్లు టీవీ లో వచ్చినా కూడా ఇంకా ఆదరణ కనిపిస్తూనే ఉంది.

తమిళ సినీ చరిత్రలో ఒక క్లాసిక్ మూవీ గా ఆ సినిమా నిలిచి పోయింది.అంతటి సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

తెలుగులో దిల్ రాజు ఈ సినిమాను ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు.విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ మరియు త్రిష పాత్రలో సమంత కనిపించబోతున్నాడు.

Advertisement

ఈ సినిమా చిత్రీకరణ విషయంలో యూనిట్ సభ్యులు చాలా లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ను ఇవ్వలేదు.

అయితే అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ అవుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.96 సినిమాలో క్లైమాక్స్ సీన్స్ ఎయిర్ పోర్ట్ లో ఉంటాయి.అంటే ప్రస్తుతం తెలుగు 96 సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లుగా చెప్పుకోవచ్చు.

దీంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వనున్నట్లుగా సమాచారం అందుతోంది.సినిమా ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

క్లాసిక్ రీమేక్ చేస్తున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు