చిదంబరంకు తీవ్ర అనారోగ్యం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తీహార్‌ జైల్లో ఉన్న విషయం తెల్సిందే.

అక్రమాస్తుల కేసులో ఆయన్ను కొన్ని వారాల క్రితం సీబీఐ నాటకీయ పరిణామాల మద్య అరెస్ట్‌ చేసింది.

ప్రస్తుతం తీహార్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న చిదంబరంకు తీవ్ర అనారోగ్యం చేసిందట.ఆ అనారోగ్యం కారణంగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.

చిదంబరం కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు చేరుకోవడంతో పాటు ఆయన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.నేడు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి అంటూ చిదంబరం జైలు అధికారులతో చెప్పడంతో వెంటనే ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు.

ఎయిమ్స్‌ ఉన్నత స్థాయి వైధ్యులు ఆయన్ను పరీక్షించి చికిత్స అందించారు.ఒకటి లేదా రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండి మళ్లీ చిదంబరం తీహార్‌ జైలుకు వెళ్లబోతున్నాడు.

Advertisement

జైలు ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కోర్టులో చిదంబరం పిటీషన్‌ వేయగా, ఇంటి ఫుడ్‌కు కోర్టు అనుమతించింది.ఇంటి ఫుడ్‌ తిన్న రెండు రోజులకు ఇలా కడుపు నొప్పి అంటూ హాస్పిటల్‌లో చేరడం జరిగింది.

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరంను కావాలని అరెస్ట్‌ చేయించారంటూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం సీబీఐ పనిలో తామేం జోక్యం చేసుకోమంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు