వింత: వ్యతిరేక దిశలో శరీర అవయవాలు,ఆశ్చర్యపోయిన వైద్యులు

మానవ శరీరంలో గుండె ఎడమ వైపు, కాలేయం కుడి వైపు ఉంటుందనే సంగతి తెలిసిందే.ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తిలో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి.

ఇతడికి గుండె కుడి వైపు, కాలేయం ఎడమ వైపు ఉన్నాయి.కుషీనగర్‌కు చెందిన ఈ వ్యక్తి అవయవాలు ఉండాల్సిన చోటు కాకుండా వ్యతిరేక దిశలో ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది.

ఇటీవల ఈ వ్యక్తికి కడుపు నొప్పి రావడంతో గోరక్‌పూర్‌లోని వైద్యుడిని సంప్రదించాడు.ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ రిపోర్టులు చూసిన వైద్యుడు అతడి అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

ఇతడి గుండే, కాలేయాలే కాదు.పిత్తాశయం కూడా ఉండాల్సిన చోట కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఉంది.

Advertisement

అంటే.ఈ వ్యక్తి పుట్టుకే తేడా అని వైద్యులు చెబుతున్నారు.

మనం అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే వ్యతిరేక ప్రతిబింబంలా అతడి అవయవాలు ఉన్నాయట.ఈ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు మాట్లాడుతూ అతడి పిత్తా శయంలో రాళ్లు ఉన్నట్లు తెలిపారు.

అయితే అతడికి అవయవాలు అన్ని కూడా వ్యతిరేక దిశలో ఉండడం తో ఆ రాళ్ల తొలగించడానికి త్రి-డైమెంన్షనల్ ల్యాప్రోస్కోపిక్ మెచిన్స్ ఉపయోగించలేమని, కేవలం అది అవయవాలు సరైన స్థానంలో ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది.కానీ ఇలాంటి వారికి మాత్రం రాళ్లను తొలగించాలంటే సర్జరీ చేయడం ఒక్కటే మార్గం అంటున్నారు.

అయితే, ఇలా వ్యతిరేక దిశలో అవయవాలు ఉండటం అనేది చాలా అరుదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పటివరకు 1643 మందికి మాత్రమే అవయవాలు ఉండాల్సిన చోట కాకుండా వ్యతిరేక దిశలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అవయవాలు ఇలా వ్యతిరేక దిశలో ఉండటాన్ని ‘సీటస్ ఇన్వెర్సస్’ అంటారు.ఈ సమస్య ఉన్నవారికి తమ అవయవాలు వ్యతిరేక దిశలో ఉన్నట్లు తెలియదు, వారికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు మాత్రమే వారికి ఈ విషయం తెలుస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు