పాకిస్తాన్‌పై మరోసారి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించాడు.1965 మరియు 1971 తప్పులు పునరావృతం అయితే ఈసారి పాకిస్తాన్ తేరుకోకుండా అవుతుందని, పాకిస్తాన్లో వ్యతిరేకత మొదలయ్యి రెండు దేశాలుగా విడిపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజ్‌నాధ్ సింగ్ హెచ్చరించారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సొంత గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది.ఇదే కనుక ముదిరితే పాకిస్థాన్‌లో రెండు ప్రాంతాలు కూడా విడిపోయేందుకు పోరాటం చేస్తాయంటూ హెచ్చరించాడు.భారత్‌తో పెట్టుకుంటే పాకిస్తాన్‌కు ఏం జరుగబోతుందో ఇప్పటికే అర్థం అయ్యిందని ఆయన అన్నాడు.పాకిస్తాన్ స్థానికులను ప్రోత్సహించి ఉగ్రవాదులుగా మల్చి ఇండియాకు పంపిస్తున్నట్లుగా రాజ్ నాధ్ సింగ్ విమర్శించాడు.
ఇండియాలో ఉగ్రవాది అయిన వ్యక్తి పాకిస్తాన్లో స్వాతంత్య్ర సమరయోధుడిగా పిలవబడుతున్నాడు అంటూ రాజ్‌నాధ్ సింగ్ ఆరోపించాడు.