ఆంధ్రప్రదేశ్‌లో నేడు నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అండ్ టీం పర్యటించారు.ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రులతో భేటీ అవ్వడం జరిగింది.
నీతి అయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.రాష్ట్రం విభజన సమయంలో తాము చాలా నష్టపోయాం.
కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదు.ఈ సమయంలో రాష్ట్రంను మీరు తప్ప మరెవ్వరు కాపాడలేరు అంటూ రాజీవ్ కుమార్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
మంత్రులు మరియు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కూడా నీతి అయోగ్ టీం ముందు రాష్ట్రంకు కావాల్సిన నిధులు మరియు కేంద్రం నుండి పొందాల్సిన వసతుల గురించి ఏకరువు పెట్టారు.కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంపై కూడా కేంద్రం ఒక నిర్ణయానికి రావడం లేదని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేలా నీతి అయోగ్ కేంద్రంకు సిఫార్స్ చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది.