ఏపీ మంత్రుల బాధ తీర్చేవారే కరువయ్యారా ?

చేతిలో అధికారం ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నామని, అటువంటప్పుడు మంత్రిగా ఉండి ప్రయోజనం ఏముంది అంటూ చాలామంది మంత్రులు ఇప్పుడు తెగ ఫీల్ అయిపోతున్నారట.

తమ మాట స్వయానా తమ శాఖలోనే చెల్లుబాటు అవ్వడంలేదని, అంతా అధికారుల ఇష్టారాజ్యం అయిపోయిందని రగిలిపోతున్నారట.

ఎందుకంటే, ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసుకోవడంతో ఆయా అధికారులు మంత్రులను లెక్కచేయడంలేదట.మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీద మంత్రులంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

పరిపాలనలో జగన్ పూర్తిగా అధికారులపైనే ఆధారపడుతుండటంతో మంత్రులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట.

  ఆయా శాఖలపై తమదే పూర్తిగా అధికారం అన్నట్టుగా కొంతమంది ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారట.ఏదైనా పని కావాలంటూ స్వయంగా మంత్రులు చెబుతున్నా అటు నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉందట.తమకు అన్ని విధాలా లాభముందంటేనే ఫైలు ముందుకు కదుపుతున్నారని మంత్రులు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారట.

Advertisement

తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే, తమపై లేనిపోని విషయాలు అధికారులు చెప్పి జగన్ దగ్గర తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తారేమో అని వెనక్కి తగ్గుతున్నారట.పరిపాలనలో పారదర్శకత కోసం జగన్ అధికార్లకు జగన్ ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడంతో కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తమ ఇస్తరాజ్యంగా చెలరేగిపోతున్నారని మంత్రులు గుర్రుగా ఉన్నారు.

  మరి కొంతమంది మంత్రులు ఈ విషయాలన్నింటిని జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా జగన్ కు సన్నిహితంగా ఉండే కొంతమంది ఆ మంత్రులకు నచ్చ చెప్పి వారించారట.పరిపాలనపై పట్టు కోసం అధికారులకు జగన్ స్వేచ్ఛ ఇచ్చింది నిజమే కానీ వాళ్ల పనితీరుపై జగన్ నిఘా పెట్టారని, అధికార యంత్రాంగంపై పట్టు దొరికాక అందరికి న్యాయం జరుగుతుందని అప్పటివరకు ఓపిక పట్టాలని నచ్చ చెప్పినట్టు సమాచారం.అయితే ఇంత సీనియర్లమై ఉండి, అధికారుల అరాచకాన్ని ఎలా భరించాలని మంత్రులు లబోదిబోమంటున్నారట.

జగన్ కూడా మంత్రులు చెప్పే విషయాలు, సూచనలకంటే అధికారులు చెప్పిన విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ప్రవర్తిస్తుండటంతో పుండు మీద కారం జల్లినట్టుగా మంత్రులు ఫీల్ అవుతున్నారట.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు