జగన్‌ 100 రోజుల్లో 125 తప్పులు

ఏపీ సీఎం జగన్‌ తన 100 రోజుల ప్రస్థానంను పూర్తి చేసుకున్నారు.ఈ సందర్బంగా వైకాపా నాయకులు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది మరియు సంక్షేమ పథకాల గురించి చెబుతూ ఉంటే తెలుగు దేశం పార్టీ మాత్రం ప్రభుత్వం వైఫల్యాలను ఎండకట్టింది.

తాజాగా జగన్‌ 100 రోజుల పాలపై నాలుగు పేజీల బ్రోచర్‌ను తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవిష్కరించారు.100 రోజుల్లో జగన్‌ 125 తప్పులు చేశారంటూ ఆ బ్రోచర్‌ విడుదల సందర్బంగా టీడీపీ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు.జగన్‌ ప్రభుత్వం పాలనను పడకేయించిందని ఆరోపించాడు.
పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుంటే జగన్‌ ప్రభుత్వం కళ్లు వెళ్లబెట్టి చూస్తుంది తప్ప మరేం చేయలేక పోతుందని ఆయన ఆరోపించాడు.

మన రాష్ట్ర ఆదాయం తగ్గి పక్క రాష్ట్ర ఆదాయం పెరిగింది.నేడు మేము విడుదల చేసిన ఈ నాలుగు పేజీల బ్రోచర్‌ వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులకు మొదటి చార్జిషీట్‌ మాత్రమే అని, త్వరలో పూర్తి చార్జిషీట్‌ను విడుదల చేస్తామని ఆయన అన్నారు.

వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తాము ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నామని అన్నారు.రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చేయని ప్రభుత్వం కమీషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా ఎద్దేవ చేశారు.100 రోజుల్లో ఈ ప్రభుత్వం 300 తప్పులు, 600 రద్దులు చేసి ఉంటుందని టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు ఆరోపించారు.సన్నబియ్యం ఇస్తామని చెప్పి చేసిన మోసం అతి పెద్దదిగా టీడీపీ నాయకులు అంటున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు