అమెరికాలో సెప్టెంబర్ 8 న రాయలసీమ వనభోజనాలు

అమెరికాలో అనేక ప్రాంతాలలో ఎంతో మంది తెలుగు వారు వివిధ రంగాలలో స్థిరపడ్డారు.ప్రతీ ఒక్కరూ ఎదో ఒక తెలుగు సంస్థలలో సభ్యులుగా ఉంటున్నారు.

 Capital Area Rayalaseema Association Vanabhojanalu Event-TeluguStop.com

వారంతరం లో అందరూ ఎదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక్క చోట కలుసుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంటారు.తెలుగు పండుగలు, విశేషాలు ఏమి ఉన్నా సరే అందరూ ఒక్క చోట కలుసుకుని ఆ రోజు సరదాగా గడిపితే తమ సొంత గడ్డపై ఉన్నట్టుగా ఉంటుందని భావిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారందరూ కలుసుకునేలా వనభోజణాలు ఏర్పాటు చేసింది.

వర్జీనియా రాష్ట్రంలోని రెస్టన్ లో గల లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ పార్క్ లో క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ సెప్టెంబర్ 8 న తెలుగువారందరికీ వనభోజనాలు ఏర్పాటు చేసింది.

ఈ వనభోజనాలకి అందరూ ఆహ్వానితులేనని తెలిపింది.నెలలో కనీసం ఒక్క రోజైనా సరే అందరూ కలుసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని, భందువుల మధ్య ఉంటున్న వాతావరం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Telugu Area, Rayalaseema, September, Vanabhojanalu, Virginia-

ఈ వనభోజన కార్యక్రమానికి హాజరుకావడానికి ఎంటువంటి అడ్మిషన్ ఫీజు లేదని, తెలుగు వారికి , భంధువులు, స్నేహితులకి ఆత్మీయ ఆహ్వానం అందించింది.సెప్టెంబర్ -8 అంటే ఆదివారం ఉదయం 11 గంటలు నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది.విందు భోజనంలో రాయలసీమ రుచులు అందరిని ఆకట్టుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.అంతేకాదు పిల్లలు పెద్దల ఆటవిడుపుకి వాలీబాల్ , కర్రా బిళ్ళ వంటి ఏర్పాటు కూడా చేసినట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube