జగన్ దారి ఎంచుకొని ఉద్యమం మొదలెట్టిన ఉపేంద్ర

కన్నడనాట సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.నటుడుగా, దర్శకుడుగా విభిన్న కథలతో తనకంటూ అభిమానులని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ ఉపేంద్ర మూడేళ్ళ క్రితం రాజకీయాలలో వచ్చాడు.

 Super Star Upendra Fallow The Ap Cm Jagan-TeluguStop.com

రాజకీయాలలోకి వస్తూనే పార్టీ పెట్టి తన పార్టీకి సింబాలిక్ గా ఖాకీ సెట్టుని ఎంచుకొని కార్మికుడుకి అండగా ఉంటుంది అని చెప్పాడు.తర్వాత మారిన పరిణామాల నేపధ్యంలో ఆ పార్టీని రద్దు చేసి మరో కొత్త పార్టీ త్వరలో లో నిర్ణయిస్తా అని ప్రకటించాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కన్నడ నాట రాజకీయాలలో తన ప్రస్తానం సాగించడానికి ఉపేంద్రకి ఒక బాణం ఇచ్చాడు.

ముఖ్యమంత్రి జగన్ ఆ మధ్య ఏపీలో ఏర్పడే పరిశ్రమలలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని జీవో జారీ చేసారు.

ఇప్పుడు ఆ జీవో ప్రభావం పక్క రాష్ట్రాలకి కూడా విస్తరించింది.ఉపేంద్ర దీనిని ఒక అవకాశంగా మలుచుకొని కర్ణాటకలో ఏర్పాటు చేసి అన్ని ప్రైవేట్ పరిశ్రమలలో డెబ్భై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలని డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు.

దాని కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.ముందుగా ఈ డిమాండ్ సాధన కోసం నిరాహార దీక్ష చేయబోతున్నట్లు చెప్పాడు.ఇక ప్రభుత్వం స్పందన మేరకు తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేసాడు.మొత్తానికి జగన్ పిలుపుని ఇప్పుడు ఉపేంద్ర అందుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా స్థానికులకే ఉద్యోగాలు అనే డిమాండ్ మరింత విష్టరించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube