ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ విస్తరించాయి.ఒకప్పుడు సినిమాలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని వేరు వేరుగా రిలీజ్ అవుతూ ఉండేవి.
స్టార్ లు కూడా ఎక్కడి వారు అక్కడే.అయితే మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్న హీరోలు తమ సినిమాలని అన్ని భాషలలో రిలీజ్ చేసే ప్రయత్నం మొదలెట్టారు.
ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు సౌత్ భాషలలో డబ్బింగ్ అవుతున్నాయి.ఇక ఇప్పుడిప్పుడే సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి.
దీంతో స్థానిక మార్కెట్ కోసం దర్శక, నిర్మాతలు నటులని కూడా అన్ని ప్రాంతాల ప్రజలకి రీచ్ అయ్యేలా ఎంపిక చేస్తున్నారు.
ఇప్పటికే సాహో సినిమాలో సౌత్ కాస్టింగ్ తో పాటు బాలీవుడ్ నటులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇక సైరాలో కూడా సౌత్ భాషలతో పాటు, బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున నటిస్తున్నాడు.ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసాడు.అమీర్ ఖాన్ హీరోగా బ్లాక్ బస్టర్ హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.లాల్ సింగ్ చందా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఇందులో ఓ కీలక పాత్రను విజయ్ సేతుపతికి ఎంపిక చేసారు.మెల్బోర్న్ లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో విజయ్ సేతుపతి కూడా ఈ విషయాన్నీ ద్రువీకరించాడు.