జమ్మూ కాశ్మీర్ అసలు ఏమి జరుగుతుంది అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.గత కొద్దీ రోజులుగా అక్కడ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారీ సంఖ్య లో బలగాలను మోహరించింది కూడా.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా గత అర్ధరాత్రి రాష్ట్రమంతా 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తుంది.
అక్కడ ఎక్కడ కూడా సభలు,సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేస్తూ మాజీ సి ఎం లు మెహబూబా,ఒమర్ అబ్దుల్లా లను పోలీసులు గృహనిర్బంధం లో ఉంచినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా రాష్ట్రమంతటా కూడా ఫోన్ లు ఇంటర్నెట్ సేవల ఉదయం నుంచి బంద్ చేసినట్లు తెలుస్తుంది.
మరోవైపు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్ ఐజీతో అత్యవసరంగా సమావేశమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి.
మరోపక్క రెండు రోజుల కిందట అమర్‌నాథ్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేసి, యాత్రికులు వెనక్కు వెళ్లాలని కేంద్రం సూచించింది.అలాగే శ్రీనగర్‌లో నిట్ క్యాంపస్‌ను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
పర్యాటకులు సైతం శ్రీనగర్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.ఇలా కాశ్మీర్ లో గంట గంటకు పరిస్థితులు మారిపోతున్నాయి.
సాధారణంగా బుధవారాల్లో సమావేశమయ్యే కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సోమవారం భేటీ అవుతుండటంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో తాజా పరిణామాలపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.మరోవైపు.జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే గట్టిగా ప్రతిఘటించాలని అఖిలపక్షం సమావేశంలో తీర్మానించారు.







