ఎలాంటి రాజీనామా పత్రం ఇవ్వలేదు అంటున్న అమరీందర్

ఒకపక్క కర్ణాటక లో సంకీర్ణ కూటమిలో లుకలుకలు తో సతమతమౌతున్న కాంగ్రెస్ పార్టీ కి పంజాబ్ లో కూడా ఎదురీత మొదలైంది అన్నట్లు వార్తలు వచ్చాయి.

పంజాబ్ లో మంత్రి గా ఉన్న నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ కి,అక్కడి సీఎం అమరీందర్ సింగ్ కు మధ్య పెద్దగా పొసగడంలేదు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడం తో రచ్చకు కూడా ఎక్కారు.ఒకానొక సమయంలో కనీసం కెప్టెన్ ని గౌరవించడం కూడా లేకుండా అధిష్టానం లో ఉన్న కెప్టెన్ కు భయపడతాను కానీ అందరికీ కాదు అంటూ పరోక్షంగా అమరీందర్ కు చురకలు కూడా అంటించారు.

మరోపక్క సిద్దూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా టీవీ షోలను సైతం వదులుకోవాల్సి వచ్చింది.మంత్రి పదవి కావాలా టీవీ షో లు కావాలా అంటూ అమరీందర్ ప్రశ్నించడం తో అన్నీ ఒప్పందాలను సిద్దూ క్యాన్సిల్ కూడా చేసుకున్నాడు.

ఆ తర్వాత వివిధ సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సిద్దూ వార్తల్లో నిలిచాడు.అప్పుడు ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా వారిలో అమరీందర్ కూడా ఉన్నారు.

Advertisement

అయితే గత లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరి మధ్య మరింత దూరంగా పెరగడం తో తను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా సిద్ధూ ప్రకటించారు.ఈ నేపథ్యంలో లేఖ కూడా అందించినట్లు తెలిపడం తో ఇక అందరూ సిద్దూ కథ ముగిసినట్లే అని అందరూ భావించారు.అయితే తాజాగా సిద్దూ ఎలాంటి రాజీనామా పత్రాన్ని సమర్పించలేదంటూ సీఎం అమరీందర్ అంటున్నారు.

ఆయన ఎలాంటి లేఖ ను ఇవ్వడం కానీ-లేక పంపడం కానీ జరగలేదు అంటూ అమరీందర్ చెబుతున్నారు.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు