ఏపీపై కేసీఆర్ కు ఎంత ప్రేముందో చెప్పిన జగన్ !

ఎవరి పేరు చెప్తే టీడీపీ అధినేత చంద్రబాబు కారాలు మిర్యాలు నూరుతాడో అదే వ్యక్తి గురించి నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పొగడ్తల వర్షం కురిపించడం తో అసెంబ్లీ సమావేశాల్లో వాద ప్రతివాదనలు కారణం అయ్యింది.ప్రస్నోత్తరాల సమయంలో ప్రాజెక్టులకు సంభందించి వచ్చిన ఓ ప్రశ్నకు సంబంధించి జగన్, చంద్రబాబు మధ్య రసవత్తరమైన చర్చకు తెరతీసింది.

మన పక్క రాష్ట్రమైన తెలంగాణతో సన్నిహితంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ విషయంలో చాలా ఔదార్యం చూపిస్తున్నారని జగన్ చెప్పడంతో సభలో మరింత అలజడి రేగింది.

-Telugu Political News

కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉన్నారని, అప్పుడు ఆయన ఎందుకు అడ్డుకోలేడని, ఆ సమయంలో గాడిదలు కాశారా అని జగన్ ప్రశ్నించారు.తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు వెళ్లానని విమర్శిస్తున్నారని, తాను వెళ్లినా, వెళ్లకపోయినా ఆ ప్రాజెక్ట్ ప్రారంభించేవారన్నారు.టీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాల కోసం హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని చంద్రబాబు బేరాలు ఆడడం నిజం కాదా అని జగన్ విమర్శించారు.

తెలంగాణతో నీటి ఒప్పందాలు జరుగుతాయని జగన్ ఈ సంద్రాభంగా స్పష్టం చేశారు.కేసీఆర్ గోదావరి నీళ్లు ఇస్తామంటున్నారని, ఎందుకు కాదనాలని ప్రశ్నించారు.గోదావరి నీటిని సాగర్, శ్రీశైలంకు తీసుకెళ్లేందుకు ఒప్పందాలు జరుగుతాయని జగన్ తేల్చి చెప్పేశారు.ఎగువ రాష్ట్రం నీళ్లిస్తామంటే వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం ప్రపంచంలోనే దిక్కుమాలిన ప్రతిపక్షమని జగన్ ఘాటుగా విమర్శించారు.

-Telugu Political News

తనను బాబు ఎంతగా విమర్శించినా పట్టించుకోను కానీ, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని జగన్ చెప్పారు.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాజెక్టులపై సంపూర్ణంగా చర్చిద్దామని చెప్పారని ఖచ్చితంగా చర్చిద్దామని ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.ఇది చాలా సున్నితమైన విషయమని భవిష్యత్ తరాల ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా వ్యవహరించవద్దన్నారు.ఎవరు రాజకీయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని,రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలన్నారు.ఈ విషయంపై రెండు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube