తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది.ఎమ్మెల్యేలను ఇక మీదట ఎక్కువ రోజులు ఊర్లోనే ఉండాలని అధినేత ఆదేశించారట.
అధినేత ఆదేశిస్తే చేయక తప్పుతుందా? అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.ప్రజల్లో టీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఈ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రజల్లోనే ఉండాలని సీఎం నిర్ణయించారట.
ఇన్ని రోజులు వారానికి ఏదో మొక్కుబడిగా రెండు లేదా మూడు రోజులు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు .ఇక మిగతా సమయంలో ఎక్కువగా హైదరాబాద్లోనే గడిపేవారు.కానీ ఇప్పుడు అలా కాదని అంటున్నారు.ఎమ్మెల్యేలు నియోజకవర్గం దాటి హైదరాబాద్ కు రాకూడదని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం. అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతోనే సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి గత ఎన్నికల్లోనే టీఆర్ఎస్ గెలుస్తుందా? అధికారం తిరిగి దక్కించుకుంటుందా? లేదా? అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించింది.2014 కన్నా ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ కు వచ్చాయి.కానీ 2024లో మాత్రం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని గ్రహించిన అధినేత ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీంతో ఎమ్మెల్యేలు వెనకా ముందు ఆడుతున్నారట.దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రజా సేవలోనే ఉండాలా? అని యోచిస్తున్నట్లు సమాచారం.రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు కూడా పెద్దగా అమలు కాలేదు.ఈ అంశం మీద చాలా మంది జనాలు అసంతృప్తితో ఉన్నారు.
వారందరినీ ఆకట్టుకోవడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సాధ్యం అవుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.