అమెరికాలో NATS వాలీబాల్ టోర్నమెంట్...

తెలుగు రాష్ట్రాల నుంచీ అమెరికా వెళ్లి స్థిరపడిన ఎంతో మంది ఎన్నారైలు అక్కడ పలు తెలుగు సంఘాలను ఏర్పాటు చేసుకుని తెలుగు వారి అభివృద్దే లక్ష్యంగా, తెలుగు వారి అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేస్తుంటారు.ఎన్నో సేవా, విద్య , వైద్య కార్యక్రమాలని నిర్వహించే తెలుగు సంస్థలు ప్రధానంగా తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేస్తుంటారు.

 అమెరికాలో Nats వాలీబాల్ టోర్నమె-TeluguStop.com

ఈ బాటలోనే ప్రతీ తెలుగు సంఘం ఎంతగానో కృషి చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు ఎన్నారైలు ఏర్పాటు చేసుకున్న నార్త్ అమెరికా తెలుగు సంఘం అక్కడే స్థిరపడిన తెలుగు వారి పిల్లల కోసం బాలల సంబరాలు ఏర్పాటు చేసింది.

సుమారు 7 నుంచీ 18 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఇందులో భాగంగా చెస్ ఛాంపియన్ షిప్, ఫ్యాన్సీ డ్రెస్, సింగింగ్, డ్యాన్సింగ్, వాలీబాల్, త్రో బాల్, వంటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించే పోటీలను 18 వ తేదీన నిర్వహించనుంది.

ఉదయం 9 గంటలకు మొదలవనున్న ఈ పోటీలు సాయంత్రం 6 గంటల వరకూ జరగనున్నాయి.

ఈ పోటీలలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్ లో https://www.natsworld.org/balala-regform?eid=20321&cname=nats-global&cid=2 రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.పోటీలలో పాల్గొనే వారికి ఫీజులు కూడా నిర్ణయించారు.చెస్ ఆడే వారికి నాట్స్ సభ్యులు అయితే 15 డాలర్లు కాగా ఇతర తెలుగు వారికి 20 డాలర్లు గా నిర్ణయించారు అలాగే ఇతరత్రా ఏ పోటీలలో పాల్గోనాలన్నా సరే నాట్స్ సభ్యులు 10 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఇంతర తెలుగు వారు 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

పోటీలు జరుగు ప్రదేశం.

చిషోలం 300, గ్రాండ్ సెంటర్ ప్లానో, TX – 75075 మరిన్ని వివరాల కోసం సంస్థ విడుదల చేసిన పోస్టర్ ను పరిశీలించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube