తెలుగులో ఇంత బిజీగా ఉండి మళ్లీ అటు ఎందుకమ్మడు

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ ఎవరు అనగానే ఠక్కున వినిపించే మూడు నాలుగు పేర్లలో ఖచ్చితంగా పూజా హెగ్డే పేరు ఉంటుంది.మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌తో నటించి, నటించబోతున్న పూజా హెగ్డే హిందీలో సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యింది.

 Pooja Hegde Stepsin Bollywood-TeluguStop.com

ఈ అమ్మడు హిందీలో రెండేళ్ల క్రితం చేసిన మొహెంజదారో చిత్రంలో నటించింది.దాదాపు ఏడాది పాటు కష్టపడి ఆ చిత్రంలో ఈ అమ్మడు నటించింది.

తెలుగులో ఇంత బిజీగా ఉండి మళ్ల

మొహెంజదారో చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.ఆ సినిమా ఫ్లాప్‌ నుండి తేరుకుని తెలుగులో నటించి వరుసగా పెద్ద సక్సెస్‌లను దక్కించుకుంది.దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది.ఇలాంటి సమయంలో మళ్లీ బాలీవుడ్‌ వైపుకు ఈ అమ్మడు చూపు చూస్తోంది.తెలుగులో చాలా బిజీగా ఉన్న ఈమె బాలీవుడ్‌ సినిమా కోసం ఏకంగా రెండు నెలల కంటిన్యూస్‌ డేట్లు కేటాయించిందట.

తెలుగులో ఇంత బిజీగా ఉండి మళ్ల

రెండు నెలలు ఏకథాటిగా హిందీ సినిమాకు ఛాన్స్‌ ఇవ్వడంతో దర్శకుడు త్రివిక్రమ్‌ సీరియస్‌ అయినట్లుగా తెలుస్తోంది.తమకు కావాల్సిన డేట్లు ఇవ్వడం లేదనే ఉద్దేశ్యంతో బన్నీ సినిమాలో ఈమె రోల్‌ను కట్‌ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈమె పార్ట్‌ లేకుండానే కొన్ని సీన్స్‌ను కానిచ్చేస్తున్నాడు.

ఈ సమయంలోనే ఈమె కాకుండా మరో హీరోయిన్‌గా నటిస్తున్న ముద్దుగుమ్మ పాత్రకు ప్రాముఖ్యత పెంచుతున్నట్లుగా సమాచారం అందుతోంది.టాలీవుడ్‌ లో చాలా బిజీగా ఉన్నా కూడా ఆశ చాలదన్నట్లుగా బాలీవుడ్‌పై మోజు పడుతున్న ఈ అమ్మడిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube