కేసీఆర్ అంటే ఏంటో జగన్ కు ఇప్పుడు తెలిసొచ్చిందా

కేసీఆర్ – జగన్ ఇద్దరూ రాజకీయ మిత్రులు అన్న సంగతి తెలిసిందే.ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఎంత కృషి చేశాడో అందరికి తెలిసిందే.

ఆర్థికంగానూ, రాజకీయంగానూ కేసీఆర్ అందించిన తోడ్పాటు వైసీపీ విజయంలో కీలకం అయిన సంగతి జగన్ కి కూడా బాగా తెలుసు.ఇక వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణాలో జరిగే అన్ని కార్యక్రమాలకు జగన్ హాజరవుతూ వస్తున్నాడు.

అంతే కాదు ఏపీకి కూడా తరుచూ కేసీఆర్ వస్తూ వెళ్తున్నాడు.తెలంగాణ, ఏపీ సీఎం లు ఇద్దరూ ఇలా స్నేహబంధం కొనసాగిస్తూనే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తామని ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేసీఆర్ మీద జగన్ కు అనుమానం పెంచినట్టు కనిపిస్తోంది.

-Telugu Political News

బుధవారం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీని జగన్ అర్ధాంతరంగా రద్దు చేసినట్టు సమాచారం.ఇటీవల ప్రగతి భవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో 9 -10 షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థల విభజనపై చర్చ జరిగిన సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ వాదన వినిపించారట.ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లలోని మొత్తాన్ని రెండు రాష్ట్రాలకు పంచేందుకు ఒకే చెప్పిన కేసీఆర్ ఆ సంస్థలకు సంబంధించి స్థిరాస్తుల పంపిణీకి మాత్రం .ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ రెండు షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలు జనాభా దామాషా పద్దతిన 58:42 ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంది.అయితే ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ.20 వేల కోట్ల నగదును మాత్రం పంచుకునేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ దాదాపుగా రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ఆ సంస్థల స్థిరాస్తులను పంచుకునేందుకు మాత్రం ససేమిరా అన్నారట.

-Telugu Political News

ఈ విషయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేయగా రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడి ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయన్న తనదైన శైలి వాదనను కేసీఆర్ వినిపించారట.అయితే ఆ సమావేశంలో ఈ విషయంపై కేసీఆర్ తో వాదించకుండా ఆ భేటీ ముగిసిన తర్వాత న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించారట.విభజన చట్టం మేరకు ఆ సంస్థల స్థిరాస్తులను కూడా పంచుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్పడంతో కేసీఆర్ ఏపీకి అన్యాయం చేసేందుకు వెనకాడడంలేదని జగన్ భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కేసీఆర్ తో వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చేయాలని ముఖ్యంగా ఏపీ ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదని జగన్ నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube