పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కు పెద్దగా పొసగడం లేదు అన్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా తృణమూల్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం కి ఒక ప్రతిపాదన చేయగా దానికి కేంద్రం నిరాకరించినట్లు తెలుస్తుంది.
పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా గా మార్చాలి అని మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరగా దానికి కేంద్రం నో చెప్పినట్లు తెలుస్తుంది.గతేడాది కూడా మమత సర్కార్ పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా గా మార్చాలి అని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేయగా దానిని కేంద్రానికి పంపారు.
అయితే దీనిపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుంది అని భావించగా ఇప్పుడు తాజాగా మమతా ప్రతిపాదనకు నో చెబుతూ కేంద్రం సమాధానం ఇచ్చింది.పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా గా మార్చే అవకాశం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్రాల పేర్లు మార్చాలి అంటే రాజ్యాంగ సవరణ అనేది అవసరం అది అంత తేలికగా జరిగే అవకాశం లేదంటూ కేంద్రం స్ఫష్టం చేసింది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య విపరీత ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా.అయితే ఇప్పుడు మమతా ప్రతిపాదన కు నో చెప్పడం తో తృణమూల్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.







