మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ఉయ్యాలవాడ వారసులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తెరకెక్కింది.ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

 Uyyalavada Family Protest On Konedala Production House1 Tstop-TeluguStop.com

ఇక దీనికి చిరంజీవి డబ్బింగ్ కూడా చెప్పేసాడు.ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

అయితే త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని గతంలో మెగా హీరో రామ్ చరణ్ నుంచి హామీ లభించిందని, జూన్ 30 లోగా తమకి ఆర్ధికంగా సహాయం చేస్తామని చెప్పారని, అయితే ఇప్పుడు తమని మోసం చేసారని ఉయ్యాల వాడ వారసులు రామ్ చరణ్ ఆఫీస్ ముందు ఆందోళనకి దిగారు.త‌మ‌ను రామ్‌చ‌ర‌ణ్ మేనేజ‌ర్ బెదిరిస్తున్నాడంటూ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యులు నిరసన తెలియజేసారు.

అయితే ఈ వ్య‌వ‌హారంపై నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ప్ర‌తినిధులు తాజాగా స్పందించారు.వందేళ్ళు దాటినా తర్వాత ఏ చరిత్ర కారుడు కథ అయిన సినిమాగా తీసుకోవచ్చని ఇందులో ఎలాంటి అడ్డంకి లేదని, గతంలో చాలా మంది చరిత్రకారుల జీవిత కథలు తెరపై ఆవిష్కరించారని, వారికి ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాలేదని అన్నారు.

అయితే ఇప్పుడు ఉయ్యాలవాడ వారసులం అంటూ కొంత మంది కోర్టుకి ఎక్కారని, వారితో తాము చ‌ర్చ‌లు జ‌రిపడం జరిగిందని, ఇప్పుడు కూడా వారితో మేం చ‌ర్చ‌ల‌కు సిద్ధంగానే ఉన్నామని తెలియజేసారు.ఉయ్యాలవాడ వారసులు ఆరోపిస్తున్న‌ట్లు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎవరు వారిని బెదిరించ‌లేదని స్పష్టం చేసారు.

ఇక దీనేఇకి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేకపోతున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube