ఇక నెక్స్ట్ టార్గెట్ లోకేష్ ? ఆ లావాదేవిపై దృష్టి

వైఎస్ జగన్ గారూ అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జి షీట్లు ఉన్నాయి.మీరు నిందితుడిగా జైలులో ఉన్నారు.

అయినా మీరు నీతి, నిజాయితీ అంటూ మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌’ అంటూ లోకేష్ విమర్శలు చేశారు.అంతే కాదు ‘మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు.

అవినీతి ముద్ర‌ వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు.చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు, ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు అంటూ భారీ భారీ స్టేట్మెంట్స్ ట్విట్టర్ ద్వారా లోకేష్ వదిలారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం టీడీపీ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న సమయంలో కొంచెం సమన్వయం పాటించాల్సిన లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ అనవసరంగా వైసీపీ దృష్టిలో పడుతున్నట్టు కనిపిస్తోంది.మీడియా ముందు ఎటువంటి విమర్శలు చేయని లోకేష్ ట్విట్టర్ ద్వారా మాత్రం జగన్ ను ఏ 1 అని, విజయసాయి రెడ్డిని ఏ 2 అంటూ పాత డైలాగులే పదే పదే చెప్తున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలో లోకేష్ దూకుడుకి కళ్లెం వెయ్యాలని వైసీపీ భావిస్తోంది.అందుకే గత ప్రభుత్వంలో లోకేష్ నిర్వహించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల్లో అవినీతి గురించి క్షుణ్ణంగా పరిశీలనలు చేయిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా భూముల కేటాయింపు అంచనాల పెంపు, ఈ రెండు అంశాల గురించి తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపుల అంశం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది.

ఈ భూ కేటాయింపుల లెక్కలు బయటకు తీయిస్తున్నారు జగన్.

అలాగే విశాఖలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో అతి భారీగా ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగానే ఉంది.ఖర్చు భారీగా పెట్టినా అందుకు సంబంధించిన ఫలితాలు అక్కడేమీ లేవని,అక్కడ భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ భావిస్తోంది.అందుకే లోకేష్ కు సంబంధించి అన్ని వ్యవహారాల్లో సరైన ఆధారాలు సంపాదించేందుకు ఇప్పటికే ఒక టీమ్ ను జగన్ ఏర్పాటు చేసారని, అవకతవకలకు సంబంధించి ఆధారాలు లభించగానే ఆయన మీద చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు