కేఏపాల్‌ బయోపిక్‌ కామెడీగా ఉంటుందా? సీరియస్‌గా ఉంటుందా?

తెలుగు రాష్ట్రాల వారికి కేఏపాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల వారు, దేశాల అధినేతలకు కూడా కేఏ పాల్‌ గురించి తెలుసు.

 Ka Paul Biopic Movie Coming Soon-TeluguStop.com

అయితే కేఏ పాల్‌ను తెలుగు రాష్ట్రాల వారు కమెడియన్‌ అంటూ ఉంటే ప్రపంచ దేశాల వారు మాత్రం ఒక గొప్ప శాంతి కపోతకుడు, పలు యుద్దాలు ఆపిన క్రైస్తవ మత బోధకుడు అని అంటూ ఉంటారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ద్వారా పాల్‌ పోటీ చేశాడు.

కేఏపాల్‌ బయోపిక్‌ కామెడీగా ఉ

ఎన్నికల సమయంలో హడావుడి చేసి కమెడియన్‌ అంటూ పేరు తెచ్చుకుంటున్న క్రైస్తవ మత బోధకుడు కేఏపాల్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఒక దర్శకుడు సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం ఇండియాలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తుంది.అందుకే కేఏపాల్‌ వంటి గొప్ప వ్యక్తి కథను కూడా జనాల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆ దర్శకుడు చెబుతున్నాడు.

కేఏపాల్‌ బయోపిక్‌ కామెడీగా ఉ

కేఏపాల్‌ గురించి అతడు తీయబోతున్న బయోపిక్‌లో కామెడీ సీన్స్‌ ఉంటాయా సీరియస్‌ సీన్స్‌ ఉంటాయా అంటూ కొందరు అప్పుడే కామెంట్స్‌ చేస్తున్నారు.కేఏ పాల్‌ సినిమా అంటే జనాలు కొందరు నవ్వుతున్నారు.ఆయన జీవితం గురించి ఏముందని సినిమాలో చూపించాలని భావిస్తున్నారు అంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే ఆ దర్శకుడు సునీల్‌ అనే నటుడిని పాల్‌ పాత్ర కోసం ఎంపిక చేశాడు.

ఇద్దరు హీరోయిన్స్‌ ఈ చిత్రంలో ఉండనున్నారు.విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఏడాది వరకు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందట.త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube