ప్రియాంక తరువాత శృతి హాసనేనట!

గ్లోబల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ కు ఇప్పుడు పెద్ద జాక్ పాట్ తగిలింది.సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన తరువాత వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు ఉన్నట్టుండి ప్రేమ,దోమ అంటూ సడెన్ గా ప్రియుడి కోసం లండన్ కూడా చెక్కేసింది.

 1 1 1shrutihasan Got Chance In Holly Wood Web Series-TeluguStop.com

దీనితో ఇక టాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మా కనిపించదు అని అందరూ భావించారు.లండన్ వెళ్లిన ఆమె అక్కడ కొన్నాళ్ళు ఆల్బమ్స్ చేసి కలిసిరాకపోవడం,ఈ లోపు ప్రియుడితో కొన్ని అభిప్రాయభేదాలు రావడం తో ఇక గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేసింది.

ఇక వెనక్కి వచ్చి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ అమ్మడు టాలీవుడ్ లో రవితేజ తో ఒక చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.అలానే మరో రెండు ప్రాజెక్టు లు కూడా ఈ అమ్మడి చేతిలో ఉండగా ఇప్పుడు హాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశం దక్కింది.

హాలీవుడ్ లో ట్రెండ్ స్టోన్ అనే సిరీస్ లో శృతి కి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.యు ఎస్ నెట్వర్క్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మిస్తుండగా,ఇందులో శృతి ఒక వెయిట్రెస్ గా పని చేస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో కనిపించనుందట.

ప్రియాంక తరువాత శృతి హాసనేనట!

థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఇండియా, యుఎస్ లో షూట్ చేస్తున్నారు.ఈ సిరీస్ కనుక హిట్టయితే ఇక శృతి పంట పండినట్లే అన్న టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.ఈ రోజు ఇంటర్నేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ఇలా సిరీస్ లో అవకాశం లభించిన తరువాతే హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు వచ్చిన సంగతి తెలిసిందే.అందులోనూ శృతి నటనకు సంబంధించి మంచి ఫెర్ఫార్మన్స్ చూపుతుంది, అలానే హాలీవుడ్ కు అనుగుణంగా వస్త్రధారణ కూడా ఉంటుంది కాబట్టి.

ప్రియాంక తరువాత ఇక శృతి హాసనే అని అందరూ అనుకుంటున్నారు.మరి ఈ సిరీస్ శృతి కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube