కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హెచ్ సంచలన ఆరోపణలు చేశారు.
కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లోకి వెళుతున్నారని, ఆయన పచ్చి అవకాశవాది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడని, వారు ఎన్నికల్లో గెలిస్తేనే కోమటిరెడ్డి సోదరులు గొప్పని, కాని ఓడితే మాత్రం ఉత్తమ్, జానారెడ్డి లు కారణమంటూ ఆరోపణలు చేస్తారని ఆయన మండిపడ్డారు.
కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఏం అన్యాయం చేసింది, పాల్వాయి కుటుంబాన్ని కాదని మరి వారికి ఎంపీ సీటు ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు.నల్గొండలో చాలా మంది కార్యకర్తలు ఉన్నా కోమటిరెడ్డి కుటుంబానికి దక్కినన్ని పదవులు ఎవరికి రాలేదని ఆయన అన్నారు.

అలానే మీ అన్నకి జడ్పీటీసీ, మీ ఆవిడకు ఎమ్మెల్సీ సీటు తీసుకున్నావ్ ఇన్ని విధాలుగా పార్టీ తో లాభ పడిన నువ్వు ఇప్పుడు కేవలం కాంట్రాక్టు ల కోసమే బీజేపీ లో పోతున్నట్లు ఆరోపణలు చేశారు.క్రమశిక్షణ కమిటీ వేరేవాళ్ళు అయితే పార్టీ నుండి సస్పెండ్ చేసే వాళ్లు కానీ, తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశవాది ఆయన పార్టీ నుంచి బయటకు పోతేనే కాంగ్రెస్ కి మంచి జరుగుతుందంటూ వీహెచ్ అభిప్రాయపడ్డారు.అయితే మరోపక్క కాంగ్రెస్ పార్టీ పై అసంతృప్తి కారణంగానే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఆయన తన పదవిని కోల్పోవలసి వస్తున్నప్పటికీ ఆయన దానికి కూడా సిద్దమై బీజేపీ లోకి మారిపోతున్నట్లు తెలుస్తుంది.







