స్టార్ హీరో లు కానీ,హీరోయిన్స్ కానీ బరువు తగ్గడం,పెరగడం సర్వసాధారణం.ఒక్కో చిత్రానికి ఒక్కో రకంగా నటీ నటులు మారుతూ ఉంటారు.
కానీ ఇక్కడ భిన్నంగా స్టార్ హీరోలతో భారీ హిట్లు కొట్టిన దర్శకుడు వి.వి.వినాయక్ బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారట.దీనికి కారణం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఒక చిత్రంలో వినాయక్ నటుడుగా మారబోతున్నాడు.
గతంలో స్టాలిన్ చిత్రంలో ఒక చిన్నపాటి క్యారెక్టర్ చేసిన అనుభవం ఉన్న వినాయక్ దిల్ రాజు సినిమా లో మాత్రం ఫుల్ లైన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈక్రమంలోనే కొంత భాగం లో ఇప్పుడున్నట్లే కొంచం లావుగా కనిపించనున్న వినాయక్, కొంచం భాగం లో కొంచం సన్నగా కనిపించాల్సి ఉంటుందట.
అందుకే ఇప్పుడు వినాయక్ ఆ పనిలో పడినట్లు తెల్సుతుంది.
త్వరలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని నరసింహ అనే డైరెక్టర్ రూపొందించనున్నారు.
ఈయన గతంలో ‘శరభ’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు.అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మాణం లో నరసింహ డైరెక్షన్ లో వినాయక్ నటిస్తున్నారు.
ఈ క్రమంలో వినాయక్ సగం షెడ్యూల్ ముగియగానే ఇప్పుదు బరువు తగ్గే పనిలో పడ్డారు.డైరక్టర్ ఒకప్పుడు మంచి హిట్టులు కొట్టిన వినాయక్ ఇప్పుడు నటుడిగా ఏ మాత్రం హిట్స్ కొడతాడో అన్న విషయం తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.







