తక్షణమే ఆ జర్నలిస్ట్ ను విడుదల చేయాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం

ఉత్తర ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఆదిత్యా నాథ్ పై పేస్ బుక్ లో అనుచిత పోస్ట్ పెట్టాడని జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ప్రశాంత్ భార్య జాగీశా అరోరా సుప్రీం ను ఆశ్రయించడం తో ఈ రోజు విచారణ చేపట్టింది.

ఆయన కేవలం పోస్ట్ మాత్రమే చేశారు, ఎవరిని హత్య చేయలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.వెంటెనే ప్రశాంత్ కనోజియా ను విడుదల చేయాలి అంటూ అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టగా జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను తాము అభినందిచడం లేదు కానీ, అతడిని ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది.

యూపీ సీఎం కార్యాలయం బయట హేమా సక్సైనా అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తాను ప్రేమ లేఖ రాశానని, తనకు పెళ్లి ప్రతిపాదన పంపినట్టు పేర్కొంది.అయితే దీనిని అంతా వీడియో తీసిన కనోజియా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.

Advertisement

దీనితో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడం తో లక్నో కు చెందిన ఒక పోలీస్ అధికారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఈ నెల 8 న ప్రశాంత్ కనోజియా ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు