అమెరికా పోలీసులకి సవాల్ విసిరాడు..దూల తీరిపోయింది...!!!

అమెరికాలో అత్యవసర పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ 911.

ఆపదలో ఈ నెంబర్ కి కాల్ చేస్తే పోలీసులు క్షణాలలో అక్కడి వచ్చి చేరుకుంటారు, సాయం అందిస్తారు.

అయితే 19 ఏళ్ల నికోలస్ అనే కుర్రాడు తాగిన మైకంలో 911 లో కాల్ చేసి ఇప్పటి వరకూ నేను మూడు చోట్ల ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశానని, ఒక్క పోలీసు కూడా నన్ను పట్టుకోలేరని మీరు వేస్ట్ అంటూ వారిని నోటికి వచ్చినట్టుగా తిట్టాడు.

అక్కడితో ఆగకుండా మీకసలు దమ్ముంటే నన్ను పట్టుకోగలరా అంటూ సవాల్ విసిరాడు.దాంతో అతడి మాటలను ఛాలెజింగ్‌గా తీసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అతడిని పట్టుకున్నారు.ఆ తరువాత కారులో సోదాలు చేయగా, డిక్కీ లో మాదకద్రవ్యాలు భారీ మొత్తంలో దొరికాయి.

అంతేకాదు సెయింట్ జాన్స్ కౌంటీ పోలీస్ కార్యాలయం పరిధిలో అతడిపై వారెంట్ ఉన్నట్లుగా గుర్తించారు.మరింత అనుమానం రావడంతో కారుని పూర్తిగా పరిశీలించిన పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది.

Advertisement

కారులో భారీ మొత్తంగలో గంజాయి దొరకడంతో పాటు తెల్లని మత్తుమందు పదార్ధం కూడా దొరికిందట.అయితే విచారణలో భాగంగా అసలు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశావ్ అని అడిగేతే ఊరికే సరదాకి చేశా, చేయకూడదా అంటూ తిక్క తిక్కగా సమాధానాలు చెప్పాడట.

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాదకద్రవ్యాల కేసు తో పాటు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కేసుని నమోదు చేశారని తెలుస్తోంది.మొత్తానికి పోలీసులకి ఛాలెంజ్ విసిరి అడ్డంగా బుక్కాయాడు నికోలస్.

Advertisement

తాజా వార్తలు