ఏపీలో తాజా ఎన్నికలల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించి అత్యధిక స్థానాలలో గెలిచి అధికారంలోకి వచ్చింది.త్వరలో వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.
ఇప్పుడు అధికార పార్టీ పరిపాలన మీద ద్రుష్టి పెట్టనుంది.ఇక టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రని ఎంత వరకు భర్తీ చేస్తుందో తెలియదు కాని ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రం భవిష్యత్తు కనిపిస్తుంద.
ప్రస్తుత ఎన్నికలలో తాను ఓడిపోయి కేవలం ఒక్కస్థానంకె పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆందోళన లేకుండా చాలా సైలెంట్ గా ఉన్నాడు.
ఇక అతని ఓటమి చూసి రాజకీయ వర్గాలతో పాటు, జనసేనని అభిమానించే వారు కొంత బాధ పడుతున్న కూడా రాబోయే రోజులలో జనసేన భవిష్యత్తు అద్బుతంగా ఉండబోతుంది అనే విషయం అర్ధం చేసుకొని కాస్తా కూల్ అవుతున్నారు.
ఇక ఏపీ రాజకీయాలలో భవిష్యత్తు అంత జనసేన పార్టీ హవా ఉండబోతుంది అనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తుంది.రాష్ట్రాన్ని నడిపించడానికి నాయకత్వం కావాలి.
ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆ పార్టీ ఏపీలో ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదు అని చెప్పాలి.చంద్రబాబు ఇంకా ఎక్కువ కాలం పార్టీని నడిపించలేరు.
ఇక వైసీపీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో ఆ పార్టీ పరిపాలన ఎలా ఉంటుంది.జగన్ నాయకత్వ శైలి ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
ఈ నేపధ్యంలో ఇక ఏపీ ప్రజలకి జగన్ తర్వాత ఉన్న ఒకే ఒక్క ఛాయస్ పవన్ కళ్యాణ్.పవన్ తన రాజకీయ ప్రస్తానం ఇలాగే కొనసాగితే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటారు అని చెప్పాలి.
మరి ఈ పొలిటికల్ స్పేస్ ని పవన్ ఎలా వినియోగించుకుంటాడు అనేది వేచి చూడాలి.