అమెరికాలో వలసదారులు జీవించాలంటే ఈ ప్రమాణాలు పాటించక తప్పదని సరికొత్త నిభందనలతో వలస విధానం బిల్లు ని తీసుకువస్తున్నారు.ఈ విధానంలో అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
దాంతో ఇప్పుడు ఈ బిల్లుపై సర్వాత్రా వ్యతిరేకత మొదలయ్యింది.అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే డ్రీమర్స్ తాజా సవరణలు మొకాలడ్డుతున్నాయి.
ఈ బిల్లుపై డెమోక్రటిక్ పార్టీ నేతలు స్పందిచారు.
అమెరికాలో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ట్రంప్ నిరాశని మిగిల్చారని ప్రతిపక్ష డెమోక్రటిక్ విమర్శలు చేసింది.
ఈ బిల్లు పుట్టీ పుట్టగానే చచ్చినట్టేనని తెలిపింది.ప్రతినిధుల సభ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పిల్లలుగా ఇక్కడికి వచ్చిన వేలాదిమంది డ్రీమర్స్ కి ట్రంప్ ఎలాంటి భరోసా ఇవ్వకపోగా వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారని అన్నారు.ట్రంప్ విధాన ప్రకటనతో వారికి ఇక్కడ జీవించే చట్టపరమైన హక్కు పోయినట్లు విమర్శించారు.

ఇదిలాఉంటే అమెరికాలోని దిగువ చట్టసభలో డెమొక్రాట్ల కి బలం ఉండటంతో ట్రంప్ ప్రతిపాదనలు ఈ సభలోనే నెగ్గాల్సి ఉంటుంది.ట్రంప్ అమెరికాలోని కుటుంభ ఆధారిత ప్రవేశాల వ్యవస్థ అంతటిని కించపరిచారని భారత సంతతి మహిళ, డెమోక్రటిక్ పార్టీ నేత ప్రమీలా జయపాల్ విమర్శలు చేశారు.ట్రంప్ విధానం పట్ల అమెరికాకి వలస వచ్చే వారు కానీ అమెరికా వాసులు కానీ ఎటువంటి సంతృప్తి వ్యక్తం చేయడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







