రాజమౌళి తో సినిమా ఉంటుంది అని చెప్పిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉంటే మహేష్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకొని నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ మరో ఆసక్తికరమైన విషయం కూడా మీడియాతో పంచుకున్నాడు.గతంలో మహేష్ బాబుతో దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా ఉంటుంది అనే టాక్ బలంగా వినిపించింది.

ఈ నేపధ్యంలో ఆ టాక్ పై మహేష్ క్లారిటీ ఇచ్చాడు.రాజమౌళితో కచ్చితంగా సినిమా ఉంటుందని, అయితే అది ఎప్పుడు అనే విషయం చెప్పలేనని అన్నారు.

Advertisement

అలాగే తమ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి సినిమా ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి సినిమానే ఉండబోతుంది అని కూడా చెప్పడం ద్వారా రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తుంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు