సొంత ఊరులో రామూయిజం చెల్లలేదు! అరెస్ట్ చేసిన పోలీసులు

టాలీవుడ్ లో పబ్లిసిటీ పిచ్చితో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ఆర్జీవికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో వర్మ ప్రెస్ మీట్ కి రెడీ అయ్యాడు.

 Rgv Arrested In Vijayawada-TeluguStop.com

అయితే హోటల్ లో అతనికి పర్మిషన్ దొరకకపోవడంతో కాస్తా శ్రుతి ముంచి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతా అని ట్విట్టర్ లో ప్రకటించాడు.ఇక తనని ఎవరూ ఆపలేరనే ధైర్యంతో నేరుగా ప్రెస్ మీట్ కి సిద్ధం అయిపోయాడు.

అయితే పోలీసులు ఆర్జీవి ప్రెస్ మీట్ కి భాగం కలిగించారు.అతను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకొని అరెస్ట్ చేసారు.ఈ విషయాన్ని ఆర్జీవి మరోసారి తన ట్విట్టర్ లో తెలియజేసారు.ఏపీలో స్వేచ్చ లేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తాను ప్రెస్ మీట్ పెట్టుకుంటా అంటే ఇలా తనని ఆపే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదు అంటూ పోస్ట్ పెట్టాడు.

మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన కూడా అర్జీవి ఏపీలో సినిమా రిలీజ్ చేయడానికి ఇలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube