ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టుకొని లీటర్లు లీటర్ల నీళ్లు తాగుతుంటాం.ఎండాకాలం లో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే మన ఆరోగ్యానికి అంతమంచిది.
ఇకపోతే మందుబాబుల గురించి చెప్పనక్కర్లేదు వేసవి లో శరీరాన్ని చల్లగా ఉంచుకోడానికి బీర్లు తాగుతుంటారు.అయితే అందుకు కూడా ఒక బలమైన కారణం ఉందండోయ్.
బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువగా ఉండి ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది.కాబట్టి వేసవిలో బీరును తాగేవారు కూడా ఎక్కువే.
కొంతమంది డీహైడ్రేషన్ కూడా తగ్గే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు.
ఈ విషయం గురించే వైద్యులను అడగగా వారు చెప్పిన కొన్ని విషయాలు ఆశక్తికరంగా ఉన్నాయి.
అవేంటి అంటే ఏడీహెచ్ అనే హార్మోన్ ప్రతీ మనిషి శరీరంలో ఉంటుందట అది శరీరంలోని నీటి శాతాన్ని కంట్రోల్ చేస్తుందని కానీ ఆల్కహాల్‌తో కూడిన బీరు పానీయం సేవించడం వల్ల ఆ హార్మోన్ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉందని చెప్పారు.అందుకే సాధ్యమైనంత వరకూ ఎండాకాలంలో ఆల్కహాల్ జోలికి పోవడం మంచిది కాదంటున్నారు పరిశోధకులు.
వీలైనంత వరకు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానీయాలే మేలంటున్నారు.బీరు తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చేమో కానీ మితిమీరి తాగితే దాని వల్ల కలిగే ఇబ్బందులు కూడా అనేకం.బీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుముఖం పడుతుంది అన్న వాస్తవాలపై కూడా అనుమానాలు ఉన్నాయి.
మందుబాబుల కోసం వేసవిలో ప్రత్యేక బీర్లు
ఈ మధ్యకాలంలో మందుబాబుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని పలు ప్రత్యేకమైన బీర్లను కూడా సిద్ధం చేస్తున్నాయి కంపెనీలు.ప్రత్యేకంగా తయారు చేసే వీట్ బీర్‌తో పాటు స్వీట్ మ్యాంగో ఫ్లేవర్డ్ బీర్లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయంటున్నారు.బహుశా.
అలాంటివి ట్రై చేస్తే సరి.అయినా సాధ్యమైనంత వరకు ఆరోగ్యం విషయంలో రిస్క్ చేయకుండా ఉండడమే ఉత్తమం.