ఓటు ఎందుకు వేయాలో తెలుసా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి దక్కిన అద్బుతమైన ఆయుదం ఓటు.మన దేశ భవిష్యత్తు ఎవరు నాయకుడు అయితే బాగుంటుందనేది మనం నిర్ణయించుకునే అవకాశం ఉంది.

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజాస్వామ్యం అవకాశం ఇచ్చింది.తనను పాలించే వ్యక్తిని తానే ఎన్నుకునే విధానం అనేది ప్రజాస్వామ్యంలోనే అద్బుతం.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన మన దేశంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య సంవత్సరం సంవత్సరంకు తగ్గుతూనే వస్తోంది.ఇది మరీ దారుణమైన విషయం.

ముఖ్యంగా అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం దారుణంగా పడిపోతుంది.

Advertisement

మన ఒక్క ఓటుతో మారేది ఏముందిలే అనుకుని చాలా మంది ఓటు వేయకుండా ఉంటున్నారు.అయితే ఒక్క ఓటుతో పోయేది ఏముంది, మారేది ఏముంది అనుకుంటే మాత్రం అది పెద్ద తప్పు, ఎంతో మంది ఇలాగే అనుకోవడం వల్ల, అసమర్థులైన నాయకులు మన దేశంను ఏలుతున్నారు.సమర్థులు నిలబడితే వారికి మనం ఒక్కరం ఓటు వేస్తే గెలుస్తాడా అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు.

అంగ బలం, అర్థ బలం ఉన్న వారు ఓటు వేయించుకోని గెలుస్తాడు, మంచి వాడు డబ్బు ఖర్చు చేయలేక ఓడిపోతాడు.ఓడిపోయే వాడికి ఎందుకు ఓటు వేయడం అని అంతా భావిస్తారు.

ఓడిపోతాడని అనుకోకుండా నీకు నచ్చిన వ్యక్తికి, నీవు నిజాయితీగా పని చేస్తాడనుకునే వ్యక్తికి ఓటు వేస్తే ఆ వ్యక్తికి వచ్చిన ఒక్క ఓటు అయినా అతడు మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తాడు.

ఒక వ్యక్తి నిస్వార్థంతో ప్రజా సేవ చేయాలని ఎన్నికల్లో పోటీ చేస్తాడు.అయితే ఆ వ్యక్తి డబ్బు పెట్టక పోవడంతో ఎవరు ఓటు వేయరు.దాంతో అతడు నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నా నన్ను గుర్తించలేదని రాజకీయాల నుండి తప్పుకుంటాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అయితే ఈసారి అతడికి కొన్ని ఓట్లు పడ్డా, కొందరు అయినా నన్ను నమ్మారు, నాపై నమ్మకం పెట్టారు.వారి కోసం అయినా, వారి సమస్యలపై అయినా పోరాటం చేస్తాను అని నిలబడతాడు.

Advertisement

ఆ తర్వాత ఎన్నికల్లో అతడు ఇంకాస్త ఎక్కువ ఓట్లు పొందడమో లేదంటే గెలవడమో జరుగుతుంది.అందుకే నిజాయితీ కలిగిన వ్యక్తి ఒక్కడున్నా, అతడు గెలవడు అని భావించినా తప్పకుండా అతడికే ఓటు వేయాలి.

అప్పుడే నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తారు.ఇతరులు వేస్తారో లేదో అనే విషయాన్ని పక్కన పెట్టి మనం వేశామా లేదా అనేది చూడాలి.

మంచి వ్యక్తులను ఎన్నికల్లో గెలిపించుకుంటేనే దేశం బాగుంటుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోండి.

ఇది ప్రతి ఒక్కరితో షేర్‌ చేసుకోండి.

తాజా వార్తలు