ఫ్లోరిడాలో ప్రాణం తీసిన తూటా..!!!

ఫ్లోరిడాలో దారుణం చోటుచేసుకుంది.కన్న తండ్రి కళ్ళముందే ఏడేళ్ళ పాప ప్రాణాలు కోల్పోయింది.

తల్లి షాపింగ్ కి వెళ్ళడంతో కాలులోనే వేచి చూస్తున్న ఆ పాప తన తల్లిని చూడకుండానే తనువు చాలించింది.ఈ ఘటనతో ఆ కుటుంభం ఒక్క సారిగా షాక్ కి గురయ్యింది.

వివరాలలోకి వెళ్తే.కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఆ ఏడేళ్ల తన తండ్రితో కలిసి కారులోనే కూర్చుని ఉంది.

తల్లి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక్క సారిగా ఆ ప్రదేశం మొత్త తుపాకులతో మారుమొగిపోయింది.అక్కడ రెండు గ్యాంగ్ లకి మధ్య జరుగుతున్న కాల్పులలో ఓ తూటా ఆ పాప ఉన్న కారు వైపుగా వెళ్లి సరాసరి ఆమె గుండెల్లో దిగడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి అంతా అయిపొయింది.అయితే ఘటనా స్థలంలో ఐదుగురు ఆందోళనా కారులని అరెస్ట్ చేశారు వారిలో వారిలో ఆ పాప చావుకి కారణం అయిన వ్యక్తికి 20 ఏళ్ళ ఖైదు విధిస్తున్నట్లు కోర్టు తీర్పుని వెల్లడించింది.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు