బాలీవుడ్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ తన సత్తా చాటుతున్న నటి, తెలుగమ్మాయి, తెనాలి పిల్ల శోభిత దూలిపాళ్ళ.అందాల పోటీలలో సత్తా చాటి తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన బోల్డ్, ఎరోటిక్ యాక్టింగ్ తో అందరిని తన వైపు తిప్పుకుంది.
అయితే ఈ తెనాలి పిల్ల తెలుగులో గూడచారి సినిమాలో నటించి హిట్ కొట్టిన ఆమెని తెలుగు దర్శకులు మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే శోభిత తాజాగా ఓ వెబ్ సిరిస్ తో నటించి తన నటనతో ఆకట్టుకుంది.
ఇదిలా ఈ మధ్య శోభిత దూలిపాళ్ళ మీద భాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.బీటౌన్ మీడియా శోభితని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటుంది.దర్శక నటుడు లారెన్స్ త్వరలో అక్షయ్ కుమార్ తో కాంచన సినిమాని హిందీలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఇప్పటికే కైరా అద్వాని హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

అయితే గత కొద్ది రోజులుగా శోభిత కాంచన సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది అంటూ కథనాలు ప్రచారం చేస్తుంది.అయితే దీనిపై శోభితకి సన్నిహితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉండటంతో ఆమె షాక్ అయ్యి వార్తలపై వివరణ ఇచ్చింది.తాను కాంచన సినిమాలో నటించడం లేదని, ఆ సినిమా కోసం తనని ఎవరు సంప్రదించలేదని శోభిత చెప్పుకొచ్చింది.గతంలో కూడా ఇలాంటి వార్తలే తనపైన ప్రచారం చేసారని, అయితే వాటిలో వాస్తవం లేదని చెప్పుకొచ్చింది.
మరి మీడియా శోభిత ని ఎందుకు అలా హడావిడి చేస్తుంది అనేది చూడాలి.







