కేజీఎఫ్ మూవీ ప్రీమియర్ షో! అభిమానుల వార్నింగ్.

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది.

 Yash Fans Warning To Electricity Board-TeluguStop.com

తెలుగు, హిందీ, తమిళంలో కూడా ఈ సినిమా సత్తా చాటింది.ఇక కన్నడ ఇండస్ట్రీలో అయితే మొదటి సారిగా వంద కోట్ల కలెక్షన్ మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేసింది.

ఓవరాల్ గా ఈ సినిమా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా కలర్స్ కన్నడ చానల్ కేజీఎఫ్ ప్రీమియర్ షో ని తన చానల్ లో టెలికాస్ట్ చేయడానికి రెడీ అవుతుంది.ఇక ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి టెలికాస్ట్ అయ్యే ఈ సినిమా కోసం హీరో యష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే టైంలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే టైంలో ఏమైనా పవర్ కట్ చేస్తే మంగుళూర్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీని తగలబెట్టేస్తామని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం కలకలకం రేపింది.అయితే యష్ అభిమానులు ఇలా వార్నింగ్ ఇవ్వడం వెనుక తాజాగా జరుగుతున్నా రాజకీయ పరిణామాలు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube