నేరగాళ్ళకి రాజమార్గం రాజకీయం! అవినీతి జాబితా తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు అనే మాట ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది.అలాగే ప్రజలే కొంత మంది నాయకులని తమ ప్రతినిధులుగా చట్టసభలకి పంపిస్తూ ఉంటారు.

 83 Percent Corruption Leaders In Lok Sabha Elections-TeluguStop.com

అయితే చట్టసభలలో కూర్చునే వ్యక్తిని ఎన్నికోవాల్సింది ప్రజలే అనే విషయం అందరికి తెలిసిందే.అలాగే ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనే విషయం అందరికి తెలిసిందే.

మరి వంద కోట్లకి పైగా జనాభా ఉన్నా దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడుతున్న నాయకులు నిజంగా ప్రజా సేవకులుగా ఉంటూ, ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారా అంటే లేదనే చెప్పాలి.చాలా మంది ప్రజా ప్రతినిధులుగా చట్టసభలకి వెళ్లేదే తమ ఆస్తులు కాపాడుకోవడానికి, లేదంటే ఆస్తులు పెంచుకోవడానికి ఈ విషయం భారతదేశంలో చాలా మంది విశ్వసిస్తారు.

మరి సరైనా నాయకులని చట్ట సభలకి పంపించే అవకాశం ప్రజల చేతులలో ఉన్న మనం మాత్రం అవినీతి, రౌడీయిజంతో పెరిగి, ప్రజలని భయపెట్టి, తమని దోచుకునే రాజకీయ తిమింగలాలని మళ్ళీ మళ్ళీ చట్ట సభలలో కూర్చోబెడుతున్నాం.ఇప్పుడు ఈ లోక్ సభ ఎన్నికలలో మరో సారి రుజువు కాబోతుంది.

ప్రజలు ఎంతగా ఆలోచన మరిచిపోయి ఉన్నారో, ఎలాంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారో స్పష్టం అయిపోతుంది.ప్రస్తుత లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడే నేతలలో 83 శాతం వరకు వరకు నేరస్తులే ఉన్నారని ప్రజా సంస్కరణల సంస్థ తెలియజేసింది.వీరిలో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొంది.521 మంది ఎంపీల 430 మంది అవినీతిపరులే అని సర్వే తెలిపింది.దీనిని బట్టి మనం ఎలాంటి వారిని చట్ట సభలకి మన ప్రతినిధులుగా పంపిస్తున్నామో అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube