చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఏళ్ళ తరబడి చదువుతూ వచ్చిన ప్రతి నోటిఫికేషన్ లకు అప్లై చేస్తారు , ఎంతో మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాస్తే అందులో ఉద్యోగం సంపాదించే వాళ్ళు చాలా తక్కువ , అలాంటిది ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేస్తున్నాడు .మన కృషి , పట్టుదల ఉంటే ఏదైనా సాదించగలం అని పెద్దలు అంటారు , ఆ మాటలని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో గొప్ప విజయాలు అందుకున్నారు.
అలాంటి వ్యక్తుల్లో ఒకరు హరీష్ ధండేవ్, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతానికి చెందిన హరీష్ మున్సిపల్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులకి ఉద్యోగం నచ్చక రాజీనామా చేసి ఇంటికి వచ్చాడు, ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసావు, ఇప్పుడు ఏం చేస్తావ్.? అని అడిగిన తండ్రికి వ్యవసాయం చేస్తా అని హరీష్ సమాధానమిచ్చాడు, మన ప్రాంతంలో వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి, మన దగ్గర ఉన్నది ఇసుక నేలలు.వాటిలో ఏ పంటలు సరిగ్గా పండవు అంటూ తిట్టి వెళ్లిపోయాడు.ఎందుకంటే హరీష్ నివసిస్తున్న ప్రాంతం థార్ ఎడారికి సమీపం లో ఉండడం అక్కడ నీటి కొరత తో పాటు పంట పండించడానికి అనువైన భూములు లేకపోవడం.

హరీష్ తన బంధువుల స్నేహితుల సలహాలు తీసుకున్నాడు , కానీ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు అక్కడ పంటలు పండవు వ్యవసాయం చేయడం వృధా అని .హరీష్ తనకున్న పరిజ్ఞానం తో అలాంటి భూములలో ఎటువంటి పంటలు పండించచో కాస్త పరిశోధన చేసాడు.వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతో తనకున్న 90 ఎకరాల భూమిలో అలోవెరా (కలబంద) మొక్కలని నాటాడు, అలోవెరా మొక్కలు ఎడారి ప్రాంతాలలో త్వరగా పెరుగుతాయి, అలోవెరా మొక్కలని ఔషధాల తయారీలో, బ్యూటీ ప్రొడక్ట్స్ , ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారీలలో విరివిగా ఉపయోగించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కలబంద మొక్కలకి డిమాండ్ ఉండటంతో హరీష్ వ్యవసాయం మొదలుపెట్టిన కొద్దీ రోజులకే లాభాలు సాధించాడు.

తన భూమిలో పెంచిన అలోవెరా మొక్కలను కొనడానికి పతంజలి ఫుడ్ ప్రొడక్జ్ లిమిటెడ్ కంపెనీతో పాటు మరికొన్ని ఔషధ కంపెనీలు హరీష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.అలోవెరా మొక్కల సాగు ద్వారా హరీష్ ఏడాదికి 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.అంతే కాదు తన 90 ఎకరాల్లో 300 కు పైగా జనాలకు ఉపాధిని కూడా ఇస్తున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగం మానేసినపుడు విమర్శించిన నోళ్లే హరీష్ ని ప్రశంశల తో పొగుడుతున్నారు.హరీష్ తండ్రి కూడా తన కొడుకు సాధించిన విజయానికి గర్వపడుతున్నాడు.కృషి , పట్టుదలతో పాటు కాస్త ఆలోచన తోడైతే తన లాగా అద్భుతాలు చెయ్యచ్చు అని హరీష్ చెప్తున్నాడు…
.







