బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా, హీరోయిన్ గా సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ తన సత్తా చూపిస్తున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ చాలా సార్లు తెలుగులో నటించాబోతుంది అనే టాక్ వినిపించింది.
ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా హీరోయిన్ కోసం పరిణితిని సంప్రదించారని టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి, మహేశ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం పరిణితిని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కాని, తాజాగా ఈ భామ కేసరి సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాలో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా అని, కచ్చితంగా తెలుగులో నటిస్తా అని అయితే అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలని అనుకుంటున్నా అని ఈ భామ చెప్పుకొచ్చింది.







