ఏపీలో రెండు ప్రధాన పార్టీలతో పాటు పోటీ పడుతూ అధికారం చేజిక్కించుకుంటాం అంటూ ఉరకలేస్తున్న ఏకైక పార్టీ జనసేన.తన పార్టీలోకి వివిధ పార్టీల నుంచీ వస్తున్న నేతలకి ఆహ్వానం పలుకుతూ కొన్ని నెలల క్రితం అధికార టీడీపీకి చెమటలు పట్టించిన జనసేన పార్టీకి క్రమ క్రమంగా తనకున్న ఫాలోయింగ్ ని కోల్పోతోంది.
ప్రజా పోరాట యాత్రలు చేసినన్నాళ్ళు జనసేనకి మాంచి మైలేజ్ వచ్చింది.అయితే ఎప్పుడైతే పవన్ అభ్యర్ధుల ఎంపిక అంటూ జనాల మధ్య ఉండటం మానేసి అప్పుడప్పుడు ట్విట్టర్ , సోషల్ మాధ్యమాల ద్వారా దర్సనం ఇస్తున్నాడో క్రమేపీ పవన్ హైప్ తగ్గడం మొదలయ్యింది.

ఈ సంధర్భంలోనే పార్టీలో కొంతమంది కీలక నేతలకి పవన్ ఏపీలో కింగ్ మేకర్ అవుతాడా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయాట.పవన్ ని నమ్ముకుని వచ్చేశాం, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో చాలా మంది నేతలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.జనసేనలో కీలకనేతగా ఉన్న ఓ వ్యక్తి, నెం -2 గా తక్కువ సమయంలోనే ఆదరణ పొందిన ఆయన పార్టీని వీడబోతున్నారు అనే వార్త జనసేన వర్గాలలో కలకలం రేపుతోంది.
జనసేనలో నెం -2 అంటే ఎవరో కాదు నాదెండ్ల మనోహర్.పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే నాదెండ్ల జనసేనలో క్రియాశీలక వ్యక్తిగా, పవన్ కి రాజకీయ మార్గం చూపించే గురువుగా పిలవబడ్డారు.
పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే పక్కన నాదెండ్ల ఉండాల్సిందే.అలాంటి నాదెండ్ల ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అనే టాక్ జనసేన అభిమానులని విస్మయానికి గురిచేస్తోంది.
ఇందుకు సంబంధించిన పుకార్లు హల్చల్ చేస్తున్నాయి.

జనసేన రాజకీయాలతో ఉపయోగం లేదని, పవన్ ని నమ్ముకుంటే భవిష్యత్తులో ప్రయోజనం తప్ప, ఈ ఎన్నికల్లో ఎటువంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి నాదెండ్ల వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ ఎన్నికల్లో గనుకా తానూ విజయం సాధించపొతే వచ్చే ఎన్నికల నాటికి భవిష్యత్తు ఉండదని లెక్కలు వేసుకుంటున్న నాదెండ్ల అందుకు తగ్గట్టుగా వేరే పార్టీ అధినేతతో సంప్రదింపులు జరిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇదంతా ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతోంది.
అధికారికంగా ఎక్కడా ఈ విషయం బయటపడలేదు.అయితే పవన్ కి నాదెండ్ల మధ్య ఉన్న రిలేషన్ ని బ్రేక్ చేయడానికే, రాజకీయంగా పవన్ ని దెబ్బకొట్టడానికి, జనసేన నేతలని మానసికంగా ఇబ్బందులకి గురిచేయడానికి చేస్తున్న చీప్ ట్రిక్స్ గా కొట్టి పడేస్తున్నారు.
ఇలాంటి వార్తలు నమ్మవద్దని, జనసేనలో నుంచీ ఎవరూ బయటకి వెళ్ళే అవకాశాలు లేవని అంటున్నాయి జనసేన వర్గాలు.
.